తాటి ముంజలు సమ్మర్ సీజన్లో దొరికే ప్రత్యేకమైన పండు. ఇవి జెల్లీలా, మృదువుగా కనిపించి, ఏప్రిల్ నుండి మే నెల వరకు పుష్కలంగా దొరుకుతాయి. తాటి ముంజలలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఎండాకాలంలో చెమట కారణంగా శరీరం డీహైడ్రేట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే తాటి ముంజలు తీసుకోవడం ద్వారా శరీరం హైడ్రేట్ అవుతుంది. బయట ఎక్కువ సమయం గడిపే వారు రోజూ త్రాగాల్సిన నీరు తాగకపోతే కిడ్నీలలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమస్యతో బాధపడేవారికి తాటి ముంజలు ఒక దివ్యౌషధంగా పనిచేస్తాయి. కడుపులో మంట, మూత్ర విసర్జన సమయంలో నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు పదిహేను రోజుల పాటు లేత తాటి ముంజలను తింటే మంచి ఫలితాలు పొందవచ్చు.
ఇది కూడా చదవండి: రోజూ చన్నీళ్ళ స్నానం చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి!
తాటి ముంజలలో ఎ, బీ, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్పరస్, పొటాషియంవంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర బరువు తగ్గించడంలో, కాలేయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. తాటి ముంజల్లో ఉండే అధిక పొటాషియం శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. శరీరానికి శక్తిని ఇచ్చి అలసటను తగ్గించడానికి, శరీరాన్ని చల్లబరచడానికి తాటి ముంజలు ఎంతో ఉపయోగపడతాయి. ఐస్ యాపిల్ అని కూడా పిలిచే ఈ పండు, సమ్మర్ సీజన్‌లో శరీరానికి అవసరమైన పోషకాలను సమకూరుస్తుంది. తాటి ముంజలు తక్కువ క్యాలరీలతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
Disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!
కొడాలి నాని హార్ట్ ఆపరేషన్.. బిగ్ అప్‌డేట్! మూడు వాల్వ్స్ లో సమస్యలు..
సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!
మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!
ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!
దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!
ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: